అక్టోబర్ లో బ్యాంకులకు భారీగా సెలవులు
1 min readపల్లెవెలుగువెబ్: ప్రస్తుతం ఆన్‌లైన్, యూపీఐ పేమెంట్లు అందుబాటులో ఉన్నా కొన్ని లావాలాదేవీలను తప్పనిసరిగా బ్యాంకుల్లోనే నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే రెగ్యులర్ బ్యాంక్ కస్టమర్లు సెలవు దినాలకు అనుగుణంగా తమ పనులను చక్కబెట్టుకుంటుంటారు. అలా రెగ్యులర్‌గా బ్యాంక్ కార్యకలాపాలపై ఆధారపడే కస్టమర్లు అక్టోబర్ నెలలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఎందుకంటే.. దసరా, దీపావళి పండుగలతోపాటు ఇతర సెలవులు, వారాంతాల్లో బ్యాంకుల క్లోజింగ్స్‌తో కలుపుకుని అక్టోబర్ హాలిడేస్ సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. సజావుగా బ్యాంకు లావాదేవీలు పూర్తి చేయాలనుకునేవారు ముందుగానే హాలిడేస్ గురించి తెలుసుకుంటే తమ కార్యకలాపాలు చక్కదిద్దుకోవచ్చు.
అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల జాబితా
అక్టోబర్ 2 – గాంధీజయంతి(ఆదివారం)
అక్టోబర్ 3 – మహా అష్టమి
అక్టోబర్ 5 – విజయదశమి లేదా దసరా
అక్టోబర్ 8 – రెండవ శనివారం
అక్టోబర్ 9 – ఈద్ ఈ మిలాద్(ఆదివారం)
అక్టోబర్ 22 – నాలుగవ శనివారం బ్యాంక్ హాలిడే
అక్టోబర్ 24 – దీపావళి
ఆదివారాలతో కలిపి మొత్తం 10 రోజులు బ్యాంకు సెలువులు ఉన్నాయి.