PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భారీ లాభాల్లో బ్యాంక్ నిఫ్టీ.. అద‌ర‌గొట్టిన ఐసీఐసీఐ బ్యాంక్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: స్టాక్ మార్కెట్ లాభాల్లో ప‌య‌నిస్తోంది. ఉద‌యం స్వల్ప న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టీ, సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లో ప‌యనిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఉద‌యం నుంచి భారీ లాభాల్లో ట్రేడ్ అవుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్ జులై-సెప్టంబ‌ర్ త్రైమాసికానికి మంచి ఫ‌లితాలు ప్రక‌టించ‌డంతో షేరు ధ‌ర దూసుకెళ్లింది. 14 శాతం లాభంతో ఆల్ టైం హైని తాకింది. దీంతో బ్యాంక్ నిఫ్టీ ఉద‌యం నుంచి లాభాల్లో కొనసాగుతోంది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల స‌మ‌యంలో సెన్సెక్స్ 198 పాయింట్ల లాభంతో 61019 వ‌ద్ద‌, నిప్టీ 33 పాయింట్ల లాభంతో 18,148 వ‌ద్ద, బ్యాంక్ నిఫ్టీ 989 పాయింట్ల లాభంతో 41312 వద్ద ట్రేడ్ అవుతోంది.

About Author