PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్యాంకర్లు… వందశాతం లక్ష్యం సాధించాల్సిందే..

1 min read

“స్టాండప్ ఇండియా” అమలుపై.. ప్రత్యేక దృష్టి సారించాలి!

డిసిసి, డిఎల్ఆర్సి బ్యాంకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఆదేశాలు
పల్లెవెలుగు వెబ్​, కడప: నిర్దేశించిన లక్ష్య సాధన దిశగా.. పనిచేసి జిల్లా ఆర్ధిక ప్రగతిలో బ్యాంకర్లు భాగస్వాములవ్వాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని స్పందన హాలులో కలెక్టర్ సి.హరికిరణ్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (DCC), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (DLRC) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జేసీలు ఎం.గౌతమి (రెవెన్యూ), ధర్మచంద్రారెడ్డి (సంక్షేమం) హాజరయ్యారు. కలెక్టర్ సి.హరికిరణ్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమార్థం నవరత్నాలు అమలు చేస్తోందని, ఇందుకు అన్ని రకాల బ్యాంకు శాఖలు ఆయా పట్టణ, గ్రామీణ పరిధిలో రుణ పథకాలకు అర్హత పొందిన లబ్దిదారులకు వెంటనే రుణాలు అందించాలి. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారిని ఆర్ధికంగా నిలబెట్టేందుకు ప్రవేశపెట్టిన “స్టాండప్ ఇండియా, జగనన్న బడుగు వికాసం” పథకాలకు అర్హత ఉన్న యువ పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు లబ్ది చేకూర్చేలా అవకాశం కల్పించాలన్నారు. అలాగే.. ముద్ర స్కీము ద్వారా అర్హులయిన చేనేతలకు అందాల్సిన రుణాలను అందించడంలో బ్యాంకర్లు లక్ష్యాన్ని అధిగమించాలన్నారు.

నిర్దేశించిన.. రుణాలివే..
జిల్లాకు నిర్దేశించిన పలురకాల ఋణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని జిల్లా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 2021 మార్చి 31 నాటికి జిల్లా క్రెడిట్ ప్లాన్ లో వార్షికంగా రూ.12950.00 కోట్ల లక్ష్యానికి గాను.. రూ.13248.47 కోట్ల రుణాలు మంజూరు చేసి 102.30% ఆర్థిక ప్రగతిని సాధించడం జరిగిందన్నారు. ఇందులో పంట రుణాలకు రూ.5500.00 కోట్ల లక్ష్యం కాగా.. 2021 మార్చి 31 నాటికి రూ.6203.51 కోట్ల రుణాలను అందజేసి 112.8% ఆర్థిక ప్రగతిని సాధించడం జరిగిందన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలలో రుణాల మొత్తం రూ. 2030.00 కోట్ల లక్ష్యానికి గాను రూ.1878.72 కోట్ల రుణాలను మంజూరు చేసి 92.55% ఆర్థిక ప్రగతిని సాధించిందన్నారు. మొత్తం వ్యవసాయ రంగానికి సంబంధించి రూ.7530 కోట్ల లక్ష్యం కాగా రూ.8082.23 కోట్ల రుణాలు అందజేసి 107.33% పురోగతి సాధించామన్నారు. ఇందుకు బ్యాంకర్లను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఎంఎస్ఎంఈ సెక్టార్ కు సంబంధించి రూ.1600 కోట్ల లక్ష్యం కాగా రూ.1170.00 కోట్ల రుణాలు అందజేసి 73.12% ప్రగతి సాధించామన్నారు. ఇతర ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి రూ.1120 కోట్ల రుణ లక్ష్యం కాగా రూ.1608.48 కోట్ల రుణాలు అందజేసి 143.61% ప్రగతి సాధించామన్నారు. మొత్తం ప్రాధాన్యత రంగాలకు గాను రూ.10250 కోట్లు లక్ష్యం కాగా.. రూ.10860.71 కోట్లు రుణాలు మంజూరు చేసి.. 105.96% ప్రగతి సాధించినట్లు తెలిపారు. నాన్ ప్రయారిటీ రంగాలకు అదనంగా రూ.2700 కోట్ల లక్ష్యానికి గాను 2387.76 కోట్ల రుణాలు అందజేసి 88.44% పురోగతి సాధించామన్నారు. సమావేశంలో నాబార్డు డిడిఎం విజయ్, యూబీఐ ఆర్.ఎం. జననీ, ఏపీజీబి ఆర్.ఎం.లు శైలేంద్రనాధ్, శ్రీదేవి, కెనెరా బ్యాంకు ఆర్ఎం సూర్యనారాయణ, ఇంచార్జి సిపిఓ వేణుగోపాల్, ఎస్సి, బీసీ కార్పొరేషన్ల ఈడి డా.హెచ్. వెంకట సుబ్బయ్య, డిఆర్డీఏ, మెప్మా పిడిలు మురళీ మనోహర్, రామమోహన్ రెడ్డి, వ్యవసాయశాఖ, పశుసంవర్ధక శాఖ జెడిలు మురళీకృష్ణ, సత్యప్రకాశ్, పరిశ్రమల శాఖ జీఎం చాంద్ బాషా, హ్యాండ్లూమ్స్ ఎడి శ్రీరంగం అప్పాజీ, డిక్కి జిల్లా ప్రతినిధి శంకర్, వివిధ బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author