బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాల్సిందే…
1 min read
ఉద్యోగ నియామకాల్లో స్వేచ్ఛ నివ్వండి..
- ఏఐబిఈఏ జనరల్ సెక్రటరి సి.హెచ్. వెంకటాచలం
- ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్
ఢిల్లీ:ఉద్యోగుల నియామకాల్లో బ్యాంకు రంగానికి స్వచ్ఛనివ్వాలని లేదా వెంటనే ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఏఐబిఈఏ జనరల్ సెక్రటరి సి.హెచ్. వెంకటాచలం. బ్యాంకు రంగానికి స్వయంపత్తి ఇవ్వాలని, ఉద్యోగులపై పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐబిఈఏ జనరల్ సెక్రటరి సి.హెచ్. వెంకటాచలం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం కారణంగా … బ్యాంకు ఉద్యోగులు విపరీతమైన పనిభారం తో శరీరకంగా.. మానసికంగా ఒత్తిడికి గురవుతూ… ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో బ్యాంకింగ్ రంగానికి స్వయంప్రత్తిపత్తి ఇవ్వాలని, అదేవిధంగా వారంలో ఐదు రోజులు మాత్రమే పని దినాలు కల్పించాలని, తాత్కాలిక ఉద్యగులను రెగ్యులరైజ్ చేయాలని, కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన ఉద్యోగ వ్యతిరేక ఆదేశాలు రద్దు చేసుకోవాలని, 12 వ వేతన ఒప్పందంలో మిగిలిపోయిన డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని, .కేంద్రం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా గ్రాట్యుటీ 25లక్షలు పెంచి ఆదాయ పన్ను తీసేయాలని, IDBI బ్యాంకు ప్రైవేట్ చేయరాదని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. నాగరాజుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో దేశంలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నట్లు యూఎఫ్బియూ కర్నూలు జిల్లా కన్వీనర్ ఈ. నాగరాజు, ఏఐబిఈఏ కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరి కె. శివకృష్ణ విలేకరులకు వెల్లడించారు.

