దివాళా తీసిన సూపర్ టెక్.. అగమ్యగోచరంగా 25 వేల మంది !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ సూపర్‌టెక్ కంపెనీ దివాలా తీసినట్లు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) నేడు ప్రకటించింది. సూపర్‌టెక్ సంస్థ బకాయిలు చెల్లించడంలో విఫలం అయ్యిందంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ ఎన్‌సీఎల్‌టీ బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది. హితేష్ గోయల్’ను దివాలా ప్రక్రియ పరిష్కార నిపుణుడిగా నియమించింది. ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్లో అప్పీల్ దాఖలు చేస్తామని రియల్ ఎస్టేట్ డెవలపర్ సూపర్‌టెక్ పేర్కొంది. ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఆదేశాల వల్ల పలు సంవత్సరాలుగా కంపెనీలో తమ ఇళ్లను బుక్ చేసుకున్న 25 వేల మంది గృహ కొనుగోలుదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నారు.