PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్యాంకులు.. ఖాతాదారులకు శఠగోపం

1 min read

– వేలిముద్రల పేరుతో మహిళా ఖాతాదారుల నగదు మాయం
పల్లెవెలుగు, వెబ్​ చెన్నూరు: వివిధ బ్యాంకులు ఖాతాదారుల ఒత్తిడి తగ్గించుకునేందుకు బీసీ పాయింట్ (బిజినెస్ కరస్పాండెంట్) ఖాతాదారుల సేవా కేంద్రాలను విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడంతో చెన్నూరు మండలం లో చెన్నూరు రామన పల్లి గ్రామాల్లో బీసీ పాయింట్లు వెలిశాయి. ఈ కేంద్రాల్లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు 18 వేల 750 రూపాయలు నగదు వారివారి అకౌంట్లలో జమ చేయడం తో ఆ డబ్బులు తీసుకునేందుకు బీసీ పాయింట్ల దగ్గరికి వెళితే వేలిముద్రలు పేరుతో అకౌంట్ లో ఉన్న డబ్బులు లాగిస్తున్నారు. ఈ సంఘటన గత వారం రోజులుగా చెన్నూర్ లో జరుగుతున్నాయి. బీసీ పాయింట్ లో డబ్బులు రావడం లేదంటూ పలువురు ఉపాధి హామీ పథకం. వెలుగు( ద్వాక్రా) అధికారుల దృష్టికి తో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. ఉపాధి హామీ పథకం ఏ పీ ఓ సుధారాణి. వెలుగు ఏ పీ ఓ. గంగాధర్ మాట్లాడుతూ బీసీ పాయింట్లలో వేలి ముద్ర వేసుకొని డబ్బులు ఇవ్వడం లేదన్న ఫిర్యాదు తమ దృష్టికి వచ్చిందని వారన్నారు. మహిళలు జాగ్రత్తగా బీసీ పాయింట్ వద్దకు వెళ్లినప్పుడు తెలిసిన వ్యక్తులను తీసుకువెళ్లాలని వారు సూచించారు. బ్యాంకుల్లోనే డబ్బులు ఇచ్చే విధంగా ఆయా బ్యాంక్ మేనేజర్లతో తాము మాట్లాడదామని వారన్నారు. ఏది ఏమైనప్పటికీ మోసాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

About Author