బ్యాంకులు మరింత చురుకైన పాత్ర పోషించాలి…
1 min read
ఎస్‌హెచ్‌జి బ్యాంకు లింకేజ్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ మరియు అవగాహనపై ప్రత్యేక సమావేశం
కర్నూల్, న్యూస నేడు: వైపి రమణారెడ్డి డిఆర్‌డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో బుధవారం కర్నూల్ జిల్లాలోని బ్యాంకు మేనేజర్లు, ఎపిఎంలు, ఏసీలు, డీపీఎంలతో కలిసి ఎస్‌హెచ్‌జీల బ్యాంకు లింకేజ్ మరియు ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అంశాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్‌డిఎం) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.పీడి డిఆర్‌డిఏ మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్నాయని తెలిపారు. బ్యాంకులు మరింత చురుకైన పాత్ర పోషించాలన్నారు.ఎల్‌డిఎం మాట్లాడుతూ, బ్యాంకు లింకేజ్‌లో బ్యాంకులు మరియు SERP ప్రాజెక్టు సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. లక్ష్యాలను సమయానికి నెరవేర్చేందుకు బ్యాంక్ బ్రాంచ్‌లు, ప్రాజెక్టు సిబ్బంది చొరవ చూపాలన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని బ్యాంకుల మేనేజర్లు, జిల్లా మరియు మండల స్థాయి సెర్ప్ సిబ్బంది పాల్గొన్నారు.