PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో.. బేరియాట్రిక్ సర్జరీ సక్సెస్

1 min read

– రాయలసీమ లోనే మొట్ట మొదటిసారి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : కర్నూల్ నగరంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న జెమ్ కేర్ కామినేని ఆసుపత్రి మరోమారు వార్తల్లోకి ఎక్కింది. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న  బాలాజీ (45) అనే  వ్యక్తికి  వైద్యులు డాక్టర్ ఎం బాలమురళి కృష్ణ( లాప్రో స్కోపిక్ సర్జన్), డాక్టర్ వి సురేష్ కుమార్ రెడ్డి (సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్), డాక్టర్ ఆదిత్య (అనస్థీషియా) విజయవంతంగా బేరియాట్రిక్ సర్జరీ చేసి ఆయనకు  ఆరోగ్యాన్ని ప్రసాదించారు. బాలాజీ ఆసుపత్రిలో చేరే నాటికే మధుమేహం, అధిక రక్తపోటు స్థూలకాయం, స్ట్రోక్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు.ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ బాలమురళి కృష్ణ, డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లాకు చెందిన బాలాజీ( వ్యకిగత గోప్యత కారణంగా పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి  107 కేజీల బరువు ఉన్నారు.  ఈ అధిక బరువు వలన నియంత్రణలో లేని మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. రక్తపోటు నియంత్రణ కొరకు యాంటీ ప్లేట్ లేట్ టాబ్లెట్స్ ను కూడా వాడుతున్నారు. సర్జరీ అనంతరం అతని బరువు 90కేజీలు అయ్యింది. ఈ సర్జరీతో అతనిలో గ్రెలిన్, లెప్రిన్ హార్మోన్ ల నియంత్రణ జరిగి కొద్ది రోజులకు 75 కేజీల బరువును కలిగి ఉంటారు. ఈ సర్జరీ రాయల సీమ లోనే మొదటిసారి చేయడం జరిగిందన్నారు. ప్రజల జీవన శైలిలో మార్పులు అనారోగ్యాలకు కారణం అవుతున్నాయి. ఎవరికి వారే ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. బాలాజీ కేసు విషయంలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని, దీంతో బేరియాట్రిక్‌ సర్జరీ చేయాల్సి వచ్చింది. జీర్ణవ్యవస్థలో మార్పు తీసుకు రావడంతోపాటు పొట్ట పరిమాణాన్ని తగ్గించాము. బరువును కూడా అదుపు చేయగలిగామని అన్నారు. బేరియాట్రిక్ సర్జరీలపై ప్రజలల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. డాక్టర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ బేరియాట్రిక్ సర్జరీ చాలా కీలకమైనదని అన్నారు. తక్కువ మొత్తంలో సామాన్యులకు కూడా బేరియాట్రిక్ సర్జరీ సౌకర్యాన్ని అందించేందుకు మేము కృషి చేస్తున్నట్టు చెప్పారు. బాలాజీ  కేసు విషయంలో డాక్టర్ బాలమురళి కృష్ణ, డాక్టర్ ఆదిత్య, డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి చేసిన కృషి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చిందన్నారు. సర్జరీ విజయవంతం కావడంలో వారి కృషి అభినందనీయమని ప్రశంసించారు. హాస్పిటల్ జనరల్ మేనేజర్ నదీమ్ మాట్లాడుతూ ఇటువంటి క్లిష్టమైన సర్జరీలు విజయవంతంగా చేయడానికి జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ వైద్యులు ఎల్లవేళల అందుబాటులో ఉంటారన్నారు.

About Author