కులాల ఆధారంగా.. రిజర్వేషన్లు వీల్లేదు !
1 min readపల్లెవెలుగు వెబ్:రిజర్వేషన్ల ఆధారంగా మద్యం దుకాణాల కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం దుకాణాల కేటాయింపును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కులాల ఆధారంగా మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కేటాయించాలని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించింది. ఈ మేరకు వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. కులాల ఆధారంగా మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి వీల్లేదని అభిప్రాయపడింది. విద్య, ఉద్యోగ రంగాల్లో మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగం స్పష్టం చేస్తోందని పేర్కొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు మద్యం దుకాణాలు కేటాయించేలా ఆదేశించాలంటూ తెలంగాణ రిపబ్లిక్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ReplyForward |