PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ల్యాబ్లో గ‌బ్బిలాలు.. చైనా పై అనుమానాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌రోన వైర‌స్ ఎక్కడ పుట్టింద‌న్న స్పష్టమైన ఆధారాలు ఇప్పటికీ దొర‌క‌లేదు. కానీ చైనా నుంచే వ‌చ్చింద‌న్న ఆరోప‌ణ‌లు, వాద‌న‌లు ఉన్నాయి. ఈ వాద‌న‌ల‌కు బ‌లం చేకూరుస్తూ స్కైన్యూస్ ప్రసారం చేసిన వీడియో ఒక‌టి ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది. ఈ వీడియో వూహాన్ ల్యాబ్ ప్రారంభం స‌మ‌యంలో చిత్రీక‌రించిన‌ది. వూహాన్ ల్యాబ్ లో గ‌బ్బిలాలు పెంచుతున్న ఆధారాలు ఈ వీడియోలో ఉన్నాయి. గ‌బ్బిలాల‌కు పురుగుల‌ను ఆహారంగా వేస్తున్న చిత్రాలు వీడియోలో ఉన్నాయి. దీంతో ఇక్కడి నుంచి క‌రోన వైర‌స్ బ‌య‌టికి వ‌చ్చింద‌న్న వాద‌న‌లకు బ‌లం చేకూరిందని ప‌లువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

About Author