PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుక్కల దాడిలో గాయపడ్డ ధనుష్ ని పరామర్శించిన బత్యాల

1 min read

– నైతిక బాధ్యత మున్సిపల్ చైర్మన్ దే – టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: రాజంపేట పట్టణంలో నిన్నటి రోజున కుక్కల దాడిలో ఎల్.కె.జి బాలుడు ధనుష్ తీవ్రంగా గాయపడిన విషయం మనందరికీ తెలిసిందే. బుధవారం నాడు తిరుపతి నగరంలోని హేలియోస్ హాస్పిటల్ నందు కుక్కల దాడిలో గాయపడ్డ ధనుష్ చికిత్స పొందుతూ ఉండగా హాస్పిటల్ కు వెళ్లి ధనుష్ ను పరామర్శించి వారి కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గం ఇంచార్జ్ గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు……., ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంఘటనకు పూర్తి నైతిక బాధ్యత మున్సిపల్ చైర్మన్ దే నని ఈ సంఘటనపై ఇంతవరకు చైర్మన్ వైపు నుండి ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమని వారు ఆ పదవిలో ఉండాల ,లేదా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి ధనుష్ ను తిరుపతి హేలియోస్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించి వారి కుటుంబసభ్యులకు భరోసా కల్పించి మానవతా దృక్పథంతో పనిచేస్తున్నారన్నారు.కుక్కల బెడద ఎక్కువైందని చట్ట ప్రకారం పశుసంవర్ధక శాఖ వారికి కుక్కలు పట్టించి వాటికి సంతాన ఉత్పత్తి కలగకుండా ఇంజక్షన్లు వేసి వదలాల్సిన పరిస్థితి ఉందని., అలా చేయకపోవడంతో వీధి కుక్కలు పెరిగిపోతున్నాయని ఏది ఏమైనా నైతిక బాధ్యత మున్సిపల్ చైర్మన్ దేనని పేర్కొన్నారు.అలాగే కుక్కలు పట్టుకోవడం లో తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.కొద్దిరోజుల క్రితం మందపల్లి హరిజనవాడకు చెందిన ఓ నిరుపేద దళిత కుటుంబీకుడైన ఊట్ల చంద్ర గొర్రెలు మేపుకొని జీవనం సాగించేవాడని వాటిలో 15 గొర్రెలను కూడా కుక్కలు అతి దారుణంగా చంపేశాయన్నారు.అలాగే నందలూరు మండలంలోని చింతకాయలపల్లిలో ఇంకా పలు చోట్ల కుక్క దాడి వల్ల గొర్రెలు ,మేకలు మృతి చెందిన సంఘటన మనం చూసామని అన్నారు. బుధవారం కూడా రాజంపేట పట్టణంలో వాకింగ్ కి వెళ్లి వస్తున్న ఒక టీచర్ ని, పెనగలూరు నుండి వస్తున్న భార్యాభర్తలు ఇద్దరూ కుక్కను తప్పించబోయి పోలు గుద్దుకుని కాళ్లు విరిగాయని, చిట్వేల్ మండలం నేతివారిపల్లి లో ఒక వృద్ధురాలిపై కూడా కుక్కలు దాడి చేశాయని తెలియజేశారు. ఇప్పటికైనా పట్టించుకోకపోతే చాలామంది కుక్కల బారిన పడి గాయాలపాలై మృతి చెందే పరిస్థితి ఏర్పడుతుందని గుర్తు చేస్తూ వెంటనే ప్రభుత్వం వాటిపై తగిన చర్యలు తీసుకొని అలాంటి కుక్కల పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అలాగే కుక్కల సంతతి పెరగకుండా వాటికి గర్భనిరోధక టీకాలు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మున్సిపల్ కమిషనర్, కోట శంకర్, శింగనమల నాగార్జున, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author