బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే మృతి
1 min readకడప: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే బద్వేలు వెంకటసుబ్బయ్య మృతి చెందారు. ఈ రోజు ఉదయం ఆయన కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస వదిలారు. ఇటీవల అనారోగ్యంతో ఆయన హైదరాబాద్ లో చికిత్స పొందారు. అనంతరం కడపకు చేరుకున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆయన పాల్గొన్నారు. అయితే.. ఎన్నికల అనంతరం అనారోగ్యంతో కడపలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతికి వైకాపా నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.