NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాక్సైట్ దోపిడీ.. ‘జ‌గ‌న్ అవినీతికి అద్దంప‌డుతోంది’

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఆంధ్ర ప్రదేశ్ సీఎం జ‌గ‌న్ అవినీతి స్థాయికి.. 15 వేల‌కోట్ల బాక్సైట్ కుంభ‌కోణం అద్దం ప‌డుతోంద‌ని టీడీపీ జాతీయ కార్యద‌ర్శి నారా లోకేష్ విమ‌ర్శించారు. విశాఖ మ‌న్యంలో బాక్సైట్ దోపిడీకి ప్రభుత్వమే ర‌హ‌దారి నిర్మించింద‌ని అన్నారు. రికార్డు స్థాయిలో 24 రోజుల వ్యవ‌ధిలో అట‌వీ ప్రాంతంలో 14 కిలోమీట‌ర్ల మేర 30 అడుగుల రోడ్డు నిర్మించి అంద‌ర్నీ ఆశ్చర్యప‌రిచార‌ని లోకేష్ అన్నారు. భారీ వాహ‌నాల రాక‌పోక‌ల‌ను సుల‌భ‌త‌రం చేసేందుకు 10 వేల చెట్లను న‌రికేశార‌ని ఆరోపించారు. 250 మంది జ‌నాభ ఉన్న మారుమూల ప్రాంతానికి ర‌వాణ సౌక‌ర్యం కోసం ఇదంతా చేశామ‌ని జ‌గ‌న్ ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉంద‌ని నారాలోకేష్ అన్నారు. ఈ మేరకు ఆయ‌న ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

About Author