బయనపల్లి 9వ వార్డు ఉప ఎన్నిక ఏకగ్రీవం
1 min read
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలోని బయనపల్లె గ్రామపంచాయతీ లోని 9వ వార్డు ఉప ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు రిటర్నింగ్ అధికారి బి శకుంతల తెలిపారు, శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, బయనపల్లె గ్రామపంచాయతీలోని తొమ్మిదవ వార్డు ఉప ఎన్నికలలో తుంగ కుమారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆమె తెలియజేశారు, గతంలో సుబ్బరాయుడు అనే వ్యక్తి 9వ వార్డు మెంబర్గా ఉండే వారని అయితే ఆయన చనిపోవడం వల్ల ఆస్థానంలో ఉప ఎన్నిక జరిగిందని అని తెలియజేశారు.