PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీసీ జనగణన అవగాహన సదస్సు

1 min read

– జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు రాజ్యాదికారం లో భాగం కల్పించకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుతాం:- వై.నాగేశ్వరరావు – – యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆదివారం పొద్దుటూరు, గాంధీ నగర్ లోని పద్మశాలి కళ్యాణ మండపం నందు బీసీ సమైక్య ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో బీసీ జనగణన అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సదస్సుకు ముఖ్యులుగాజాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్ గారు,రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ గారు, పొద్దుటూరు బిసి సమాఖ్య అధ్యక్షులు సోమా లక్ష్మీ నరసయ్య గారు,ప్రొఫెసర్ కాసీం గారు, ఉస్మానియ యూనివర్శిటి, హైదరాబాదు,వలిగట్ల రెడ్డప్ప గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురుమూర్తి యాదవ్ గారు, బి.వి. రమణా రాజు, ప్రధాన కార్యదర్శి,మల్లెల భాస్కర్ గారు, శశిధర్ గారు,, చంద్రబాబుగారు,గుండుమల్ల శంకర్, కత్తి నిర్మల దేవి గారు,కొండపల్లి శేషగిరి రావు గారు,నాగమల్ల విశ్వ ప్రసాద్ గారు,గొర్రె శ్రీనివాసులు గారు,సుబ్రమణ్యం గారు,చల్లా రాజగోపాల్ గారు, రాష్ట్ర సీమాంధ్ర బి.సి. సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు,వడ్డె బాల పెద్దయ్య గారు,గొడుగు గుర్రప్ప గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రామసుబ్బయ్య యాదవ్ గారు, శివ నారాయణ గారు, సహా అధ్యక్షులు,తిరుపతయ్య గారు,బి.వి. రమణ రాజు గారు, ప్రధాన కార్యదర్శి,జింకా రాజాశేఖర్ గారు, వి.వి.క్రిష్ణయ్య యాదవ్, కోశాధికారి,సుధాకర్ రాజు గారు,బీసీ సమైక్య నాయకులు, బీసీలు 100 మందికి పైగా పాల్గొని బీసీల హక్కుల సాధనకై కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సదస్సులో వై.నాగేశ్వరరావు యాదవ్ గారు మాట్లాడుతూ: గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు బీసీలను చైతన్యపరచాలి. గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు బీసీ సంఘాలను బలోపేతం చేయాలి. మన సమస్యలను పై మన గలాన్ని ఢిల్లీ దాకా వినిపించేలా బిసి నాయకులను, మహిళా నాయకురాలను సంఘటితం చేస్తున్నాము. అడవులలో తిరుగుతున్న జంతువులకు సైతం ఘనన ఉంది కానీ బీసీలకు మాత్రం జన,కుల గణన జరపడం లేదు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని బీసీల జనభాను లెక్కించాలి.జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు విద్య, వైద్య,రాజకీయ,ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలి. జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించినట్లయితే సంక్షేమ ఫలాలు సమృద్ధిగా,అందరికి సమానంగా అందుతాయి. జనాభా నిష్పత్తి ప్రకారం బిసి లకు రాజ్యాధికారంలో భాగం కల్పించకపోతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నాం.అదేవిధంగా పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి.బీసీల విద్య ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ ను తొలగించాలి.అసెంబ్లీ పార్లమెంటు సీట్లను వంద శాతం పెంచాలి ఇలా పెంచిన సీట్లను ఇంతవరకు అసెంబ్లీ పార్లమెంట్ గడప తొక్కని బీసీ కులాల వారికి నామినేటెడ్ పద్ధతి మీద ఆంగ్లో-ఇండియన్లు ఇచ్చిన మాదిరిగా నామినేట్ చేయాలి.కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీల అభివృద్ధికి ప్రత్యేక స్కీమ్లను రూపొందించాలిఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ భద్రత కల్పించడానికి బీసీ యాక్టు ను తీసుకురావాలి.రాష్ట్రంలో కేంద్రంలో విద్య ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి.సుప్రీం కోర్టు హైకోర్టు జడ్జి నియామకాలలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలి.కేంద్ర స్థాయిలో లక్ష కోట్ల బడ్జెట్ తో బిసి సబ్ ప్లాన్న్ ఏర్పాటు చేయాలి.

About Author