బీసీల హక్కుల సాధనకై బీసీ జనభేరి – బీసీ సేన
1 min read– ఉయ్యూరులో పోస్టర్.. గోడపత్రిక ఆవిష్కరణ
పల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు : బీసీ హక్కుల సాధన కోసం ఈనెల 22 తేదీన బుధవారం సాయంత్రం, గుంటూరు జిల్లా, మంగళగిరిలో జరగబోవు బీసీ జనభేరి మహా సదస్సుకు సంబంధించి, జిల్లా ప్రధాన కార్యదర్శి లంక శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక ఉయ్యూరు అంబేద్కర్ నగర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద, బీసీ జనభేరి పోస్టర్ మరియు గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సేన ముస్లిం మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆసిఫ్ పాషా, బీసీ సేన రాష్ట్ర జనరల్ సెక్రెటరీ దేవరాజు గట్టు శివ కొండలరావు, ముస్లిం మైనార్టీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖదీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి లంక శ్రీనివాసరావు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ దగడ సాయి, పుట్టపు జయప్రకాష్, శివాజీ తదితరులు పాల్గొని బీసీ జనభేరి పోస్టర్ మరియు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఆసిఫ్ పాషా మాట్లాడుతూ ఈ బీసీ జనభేరి కి జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య, బీసీ వాదులు హాజరవుతున్నారని తెలుపుతూ, బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కల్పించాలని, ఉన్నత విద్యాలయాల్లో, ఉద్యోగాల్లో బీసీలకు ప్రమోషన్ కల్పించాలని, బిసి ముస్లింలకు ప్రభుత్వాలు నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పించాలని, రాష్ట్రంలో అన్ని మండలాల్లో, గ్రామాల్లో కవర్ స్థానంలో ఈద్గాలు లను ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.