బనగానపల్లె ఎమ్మెల్యే పై బీసీ జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు !
1 min readపల్లెవెలుగువెబ్ : బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఇళ్లపట్టాల పేరుతో కాటసాని రూ.2 కోట్లకు పైగా ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేశారని ఆరోపించారు. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో కాటసాని ఫ్రస్టేషన్‌లో ఉన్నాడని తెలిపారు. సొంత బావమరిదితో కిరాయి హత్యలకు పాల్పడడం, డబ్బుల కోసం బెంగళూరులో కాంట్రాక్టర్‌పై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు.