PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీసీ నేత నాగేశ్వరరావు యాదవ్​కు ఎమ్మెల్యే టికెట్​ ఇవ్వాలి

1 min read

– జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: నగరంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం భవనం నందు గత నెల 25 న రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ గా కొనసాగకూడదని అధికార పార్టీ నాయకుల అండదండల తో కొంతమంది అవిశ్వాస తీర్మానం పెడితే, ఆ అవిశ్వాస తీర్మాణాన్ని నెగ్గినందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వై.నాగేశ్వరరావు యాదవ్ గారికి సన్మానం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు గారు, కర్నూలు జిల్లా అధ్యక్షుడు మురళీ మనోహర్ గారు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాంబాబు గారు, రాష్ట్ర మహిళా నాయకురాలు శకుంతలమ్మ గారు,టీడీపీ బీసీ సెల్ నాయకులు సత్రం రామకృష్ణ గారు,టీడీపీ యసి సెల్ జేమ్స్ గారు,స్పోక్స్ పర్సన్ రాజు యాదవ్ గారు,తెలుగు యువత భజారన్న గారు,కురుమూర్తి గారు, విద్యార్థి సంఘాల నాయకులు రామకృష్ణ గారు,మోహన్ గారు,నాగరాజు గారు, ఈశ్వరయ్య గారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వై.నాగేశ్వరరావు యాదవ్ గారు మాట్లాడుతూ బీసీల జనగణన చేయాలని,  బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సుప్రీం కోర్టు జడ్జి నియామకంలో బీసీలను ఎందుకు నియమించడంలేదని, .బీసీలకు సుప్రీం కోర్టు జడ్జి నియామకంలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్​ చేశారు.  ఆ తరువాత నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం, తెలుగుదేశం పార్టీ, యాదవ సంఘం,లయన్స్ క్లబ్ లో వై. నాగేశ్వరరావు యాదవ్  సేవలు మరువలేనివని, ప్రజా మద్దతుతో ఓటు వేయించుకొని గెలిచాడు కాబట్టే వై నాగేశ్వరరావు ఈరోజు గొర్రెల మేకల పెంపకం దారుల ఫెడరేషన్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.  అలా ఎన్నికైన తర్వాత జీర్ణించుకోలేని అధికారంలో ఉన్న పార్టీ నాయకులు మొట్టమొదట తొలగించాలని అవిశ్వాస తీర్మానం పెట్టారు … ప్రజా నాయకుడు కాబట్టే మళ్లీ… ఆయన సత్తాచాటారన్నారు.

About Author