బీసీ రెసిడెన్సియల్ హాస్టల్ ఏర్పాటు చేయాలి..
1 min readపి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మహేంద్ర బాబు డిమాండ్…
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు లో బిసి రెసిడెన్సియల్ హాస్టల్ ఏర్పాటు చేయాలనీ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పి.డి.ఎస్.యు) జిల్లా ప్రధాన కార్యదర్శి బి. మహేంద్ర బాబు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక పట్టణంలో న్యూ డెమోక్రసీ కార్యాలయంలో పట్టణస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బి.మహేంద్ర బాబు మాట్లాడుతూ ఎమ్మిగనూరు చుట్టూ మూడు నియోజకవర్గా కేంద్రాలు ఉన్నాయి కానీ బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లేకపోవడంతో విద్యార్థులు చదువుకొనుటకు దూర ప్రాంతాలకు వెళ్లి విద్యను అభ్యసించే పరిస్థితి కనబడుతుంది అన్నారు. అదేవిదంగా ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గ కేంద్రాలు నిత్యం కరువుకటకాలతో కొట్టిమిట్టిలాడుతూ పశ్చిమ ప్రాంతమైనటువంటి నిత్యం వలసలు వెళ్తూ విద్యార్థులను కూడా వారి వెంట తీసుకొని పోవడంతో విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని వారు అన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి ఎమ్మిగనూరులో బిసి రెసిడెన్షియల్ పాఠశాల తక్షణమే ఏర్పాటుచేయాలనీ వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో పి.డి.ఎస్.యు జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ నాయుడు, నాయకులు భరత్, నరసింహ,సమీర్, రవి, బాషా, అనిల్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.