బిసి కులగణన చేపట్టాలి!
1 min read
జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు
కర్నూలులో బీసీ సంఘాల నాయకుల రౌండ్ సమావేశం
బీసీ సంఘాల, కుల సంఘాల నేతలు డిమాండ్
పల్లెవెలుగు , కర్నూలు: (కర్నూలు)ఆంధ్రప్రదేశ్ బి.సి కుల సంఘాల, బి.సి సంఘాల జె.ఎ.సి ఆధ్వర్యంలో బి. క్యాంప్ లోని బి.సి భవన్ కర్నూలులో బీసీ కులాల జనగణన చేపట్టాలనే డిమాండ్ తో రౌండ్ టేబుల్ సమావేశం , జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేంపెంట రాంబాబు ఆధ్వర్యంలో జరిగింది.రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది..సమావేషంలో వివిధ కులసంఘాల నాయకులు మాట్లాడుతూ
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కులాల జనగణన చేపట్టాలి.2 బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి కుల జనాభా ఎంతో వారికి విద్య. ఉద్యోగ, ఉపాధి. రాజకీయ రంగాల్లో వారికి అంత వాటాలు కల్పించాలి..3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి.4. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ రంగాల్లో ఏబిసిడి వర్గీకరణ చేసిన విధంగానే రాజకీయ రంగాల్లో కూడా ఏబిసిడి వర్గీకరణ చేపట్టి ఎంబిసి కులాలకు న్యాయం చేయాలి…5. ఇంతవరకు చట్టసభల్లో అడుగుపెట్టని ఎంబిసి కులాలకు రాజ్యసభ, ఎమ్మెల్సీ, రాష్ట్రస్థాయి నామినేటెడ్ చైర్మన్ పదవులు కేటాయించి సామాజిక న్యాయానికి పెద్ద పీట వేయాలి.6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కుల కార్పోరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.. లబ్దిదారుడికి రుణాలు కేటాయించే విషయంలో బ్యాంకులతో సంబంధం లేకుండా వివిధ బీసీ కుల కార్పొరేషన్ల ద్వారానే నేరుగ రుణాలు మంజూరుచేయాలి.7. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్ లో బీసీల అభివృద్ధికి, సబ్ ప్లాన్ అమలుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.పైన పేర్కొన్న డిమాండ్ల సాధనకు కార్యాచరణ రూపొందించుకుని దశల వారీగా ఉద్యమాన్ని చేపట్టాలని బీసీ సంఘాల, కుల సంఘాల నేతలు ఏకగ్రీవంగా తీర్మానించారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వర యాదవ్, , బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ బాబు,.బిసి యువజన నాయకులు వైసిపి నేత ధర్మ,సీనియర్ బీసీ నాయకులు వాడాల నాగరాజు, రంగా, వైసీపీ బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు బబ్లు, బిజెపి పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు మురళీధర్ నాయుడు, రాయలసీమ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వివి నాయుడు, రాయలసీమ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్, నంద్యాల పార్లమెంట్ యువజన సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ యాదవ్ , బీసీ మహిళ నాయకురాలు భారతి, రేణుకమ్మ, రాధమ్మ, యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అయ్యన్న యాదవ్, ఆరె కటిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాజీ రావు, జాతీయ మత్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులు గ్యాస్ శ్రీనివాసులు, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమేశు, బజారి,ఉప్పరి సంఘం అధ్యక్షులు సత్యన్నా, నాగభూషణం.విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బ్రహ్మయ్య,బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు.వడ్డెర సంఘం నాయకులు బాలాజీ, ఏపి బెస్త సంఘం కన్వినర్ పిజి. వెంకటేష్.ఆల్ ఇండియా బీసీ జేఏసీ సంఘం నాయకులు హేమంత్ గౌడ్, కురువ సంఘం నాయకులు నాగేష్, వెంకటేష్. విద్యార్థి నాయకులు రవి రాజ్, ఆనంద్, ఈశ్వరయ్య, పవన్, దిలీప్, లక్ష్మన్న, మరియు 28 కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.