PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీసీసీఐ నెక్స్ట్ బాస్ రోజ‌ర్ బిన్నీ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో కొత్త బాస్ ఎవరొస్తారన్న ఊహాగానాలకు దాదాపు తెరపడింది. టీమిండియా మాజీ క్రికెటర్, 1983లో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోని సభ్యుడైన పేసర్ రోజర్ బిన్నీ పేరు తెరపైకి వచ్చింది. బిన్నీ గతంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యుడిగానూ పనిచేశాడు. ఇప్పుడీ మాజీ పేసర్ గంగూలీ స్థానాన్ని భర్తీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా మాత్రం అదే పదవిలో కొనసాగుతారని తెలుస్తోంది.

                                          

About Author