బీసీల పక్షపాతి.. సీఎం జగన్..: వైస్ చైర్మన్ రమేష్ నాయుడు
1 min readపల్లెవెలుగువెబ్, నందికొట్కూరు : శాసనసభలో బీసీల జనగణనకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసి బీసీలకు అండగా నిలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీల పక్షపాతి అని చాటిచెప్పారని పగిడ్యాల ఎంపీపీ మండ్ల మల్లేశ్వరి , నందికొట్కూరు వ్యవసాయ మార్కేట్ కమిటీ వైస్ చైర్మన్ రమేష్ నాయుడులు అన్నారు.గురువారం వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ జనగణన కు ఆమోదం తెలిపిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ నందికొట్కూరు మార్కెట్ యార్డులో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆదేశాల మేరకు బీసీ సంఘం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పగిడ్యాల మండలం ఎంపీపీ మల్లేశ్వరి, మార్కెట్ కమిటీ. వైస్ చైర్మన్ గుజ్జుల రమేష్ నాయుడు ,బీసీ సెల్ పార్లమెంటరీ అధ్యక్షులు కాలూరి శివప్రసాద్ ,కొత్తపల్లి మండలం వైస్ ఎంపిపి శింగారం రంగా ,కౌన్సిలర్ చాంద్ భాష లు మాట్లాడుతూ బీసీలను గుర్తించి వారికి రాజకీయ పరంగా సముచిత స్థానం కల్పించిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో బీసీలకు సీఎం అండగా ఉంటూ అన్ని పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీలను అట్టడుగు స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చిన సీఎం జగనన్న అని బీసీ నేతలు తెలిపారు.ఎక్కడో ఉన్న మాకు రిజర్వేషన్ల పరంగా సీఎం జగన్ అండగా ఉంటే మమ్మలి గుర్తించి మాకు పదవులు వచ్చేలా కృషి చేసిన శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు బొల్లవరం ఉప సర్పంచ్ సురేష్ యాదవ్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు గఫార్ ,సుంకేసుల రాముడు,లింగాపురం రమణ,జలకనూరు రవి,మల్యాల నాయుడు,చింతా విజ్జి,చింతా శ్రీను,ఉస్మాన్ బేగ్,బాండ్ శీను,బొట్టు రవి,మహేష్,సన అబ్దుల్లా,వీపనగండ్ల అంజి,ప్రాతకొట మల్లయ్య, వాసు, నరసింహా, కురుమన్న,మురళి,జయరాం గౌడ్,జగదీశ్వరయ్య,ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.