బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ అని నిరూపించిన సీఎం జగనన్న
1 min readబీసీలకు అండగా నిలించింది సీఎం జగనన్నే
మంత్రి మండలి నుంచి గ్రామస్థాయి పదవుల వరకు వరకు బీసీలకు అత్యధిక ప్రాధాన్య ఇచ్చింది ఈ భారత దేశ చరిత్రలో సీఎం జగనన్న మాత్రమే ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుసినే విరుపాక్షి
పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు నియోజకవర్గo కేంద్రంలోని స్థానిక అతిధి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో బుసినే విరుపాక్షి మాట్లాడుతూచంద్రబాబు హయాంలో బీసీల కోసం ఖర్చు చేసింది కేవలం రూ.19 వేల కోట్లు సీఎం వైయస్ జగన్ పాలనలో 2019 నుంచి ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.1.78 లక్షల కోట్లు (డీబీటీ + నాన్ డీబీటీ) సామాజిక, సంక్షేమ, ఆర్థికంగాను ఎస్సీ ఎస్టీ బీసీలను మైనార్టీలను ఆదుకున్న ఘనత సీఎం జగనన్నకే దక్కుతుంది. ఎందుకంటే సీఎం జగనన్న ఎప్పుడు నా ఎస్సి నా ఎస్టి నా బీసీ నా మైనారిటీ అంటూ ప్రతి ఒక్కరికీ తోడుగా ఉన్నాడుపరిపాలనపరంగా సామాజికపరంగా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక సీఎం జగనన్న మాత్రమే.నేను గుమ్మనూరు జయరాం ని ఒకటే అడుగుతున్నా కర్నూలు జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా నాయకులు ఉన్న నీవు ఐదు సంవత్సరాలు మంత్రిగా చేసావంటే అది ఒక్క సీఎం జగనన్న వల్లే . అలాంటి జగనన్నను నీవు అహంకారంతో ఒక శిలా అని అంటున్నావ్ నాకు సామాజిక న్యాయం జరగలేదు అంటున్నావు. నువ్వు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు మంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు నీకు సామాజిక న్యాయం గుర్తు రాలేదా అని అడుగుతున్నాను.గుమ్మనూరు జయరాం మిమ్మల్ని అడుగుతున్నా కర్నూలు జిల్లాలో నీకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి ఐదు సంవత్సరాలు మంత్రిగా చేస్తే ఆలూరు నియోజకవర్గం లో ప్రజల అవసరాలను మరిచిపోయి, ఆలూరు అభివృద్ధిని మరచి అహంకారంతో అధికారాన్ని అనుభవించావు. సామాజిక న్యాయం లో భాగంగా సీఎం జగనన్న నిన్ను మంత్రిగా చేసి భుజాన మోస్తే ప్రజల్లో నీకు మంచి పేరు లేదని తెలిసినా ప్రజలను నమ్ముకున్న కార్యకర్తలను నువ్వు చేసిన మోసాన్ని మరిచి జగనన్న మళ్లీ నీకు ఎంపిగా సీటు ఇస్తే, నీ అసమర్ధత తో, నీ అభద్రతాభావంతో, నేను ఓడిపోతాను అనే భయంతో కన్న తల్లి లాంటి వైఎస్సార్ పార్టీని వదలి,ఇప్పుడు నువ్వు వెళ్లి చంద్రబాబు కాళ్ళ మీద పడ్డావు, బీసీల మనోభావాలను చంద్రబాబు కాళ్ల దగ్గర పడేశావ్జయరాం ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఆలూరులో పోటీ చేసిన, కర్నూలు జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేసిన రాష్ట్రంలో ఏ మూల నుంచి పోటీ చేసిన నువ్వు ఓడిపోవడం పక్క, డిపాజిట్ కూడా తగ్గకుండా ఓడిపోతావ్, ప్రజలు ఓడిస్తారు. నువ్వు ప్రజల్లో ఆదరణ కూడా పోయావు, అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు ప్రజలను కార్యకర్తలను పట్టించుకున్న దాఖలు లేవు కాబట్టి నీవు ఎక్కడి నుంచి పోటీ చేసిన అక్కడ ప్రజలను ఓడించడం ఖాయమని తెలియజేస్తున్నాను.దమ్ముంటే ఆలూరు టికెట్ తెచ్చుకో గుమ్మనూరు జయరామ్ …. నీ బలం ఏంటో,నీ సామర్థ్యమెంతో ఆలూరు నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల నుంచి వచ్చిన ఎంపీపీలు జెడ్పిటిసిలు సింగిల్ విండో చైర్మన్లు నాయకులు కార్యకర్తలు jcs కన్వీనర్లు పాల్గొన్నారు.