`ఆయన పాలనలో బీసీలకు రక్షణ లేదు ` !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనలో బీసీలకు రక్షణ లేదని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. తెలుగుదేశం నేత చంద్రయ్యను పొట్టనబెట్టుకుని వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని ఆయన అన్నారు. రాజకీయ నేరస్తులు అధికారం చేపడితే ఎంత ప్రమాదకరమో.. దానికి నేడు జగన్ ఉదాహరణ అని ఆయన అన్నారు. తెలుగుదేశాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.