PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీసీవై పార్టీ ప్రతి గ్రామంలోనూ జెండా ఎగురవేస్తుంది 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని బిసివై పార్టీ టచ్ చేస్తుందని, త్వరలో ప్రతి మండలంలో బిసివై జెండా ఆవిష్కరణ జరుగుతుందని,అధికార మదంతో వైసిపి ఆగడాలకు అంతులేకుండా పోయిందని, ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారని బీసీవై పార్టీ రాష్ట్ర నాయకులు వాచకం యాదవ్ స్పష్టం చేశారు.ఈ రెండు పార్టీలకు ధీటైన పార్టీ బిసివై పార్టీ ఒక్కటే అని ఆయన అన్నారు.జిల్లా కమిటీలపై త్వరలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని,ప్రతి జిల్లాలో నేతలతో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సమావేశాలు నిర్వహిస్తారని మీట్ ది ప్రెస్ లో బీసీవై పార్టీ రాష్ట్ర నేత రాచ కౌలుట్లయ్య యాదవ్ వెల్లడించారు.  రాష్ట్రంలోని ప్రతి గుండెను బీసీవై పార్టీ   “టచ్” చేసిందని, రాష్ట్ర ప్రజలు హృదయాలను గెలవడమే ఇంకా తరువాయి భాగమని, బిసివై పార్టీ రాష్ట్ర నాయకులు రాచ కౌలుట్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన కర్నూలుల్లో మీట్ ది ప్రెస్ లో ఆయన పాలు అంశాలను వెల్లడించారు.   అధికార ప్రతిపక్ష పార్టీలకు దీటైన పార్టీగా భారత చైతన్య యువజన పార్టీ ఒక్కటే అని అన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో పార్టీ విస్తరించే విధంగా అధిష్టానవర్గం ఇప్పటికే ప్రతిపాదనలు తాయారు చేసి సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తిని రామచంద్ర యాదవ్ పలకరించే విధంగా ముందస్తు ప్రణాళికను కూడా తయారు చేసుకున్నారన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రతి మండలంలో బీసీవై జెండాను ఆవిష్కరించే ప్రణాళికను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మండలాల్లో పార్టీ పతాక ఆవిష్కరణ చేస్తూనే, జిల్లా కమిటీలను కూడా ప్రతిష్టాత్మకంగా అధిష్టానం నియామకం చేపడతామని చెప్పారు.  అధికార పార్టీ ఆగడాలకు ప్రజలు విసుగెత్తి పోయరన్నారు.   ప్రజలు ప్రతిది గమనిస్తూనే గుర్తు చేశారు. రాక్షస పాలనను అంతమొందించడమే బీసీవై ధ్యేయంగా పెట్టుకుందన్నారు. ప్రజల గుండెచప్పుడు తెలుసుకుని పాలన అందించటమే బిసివై లక్ష్యం అని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలే ఏలు బడిలో ఉన్నాయన్నారు. ప్రజల కంట కన్నీరు తుడిచి, రైతు పొలాల్లో పన్నీటి ప్రవాహాలు ప్రవహింప జేస్తూ, ప్రతి ఇంట సిరుల పంట పండించాలన్న ధ్యేయంగా రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిర్భవింప చేశారన్నారు. గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా రామచంద్ర యాదవ్ అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే త్వరలో జిల్లా కమిటీలను నియమిస్తూ,  ప్రతి జిల్లా నేతలతో ఆయన స్వయంగా మాట్లాడతారని కాలుట్ల యాదవ్ చెప్పారు. బడుగు బలహీన వర్గాల కోసమే పార్టీ ఆవిరిభవించిందని వారి భవిత కోసమే నిత్య పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

About Author