సరిహద్దు చెక్పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా ఎస్పీ
1 min readపల్లెవెలుగు వెబ్ తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర సాధారణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30 వ తేదీన ఉన్నందున జిల్లా సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్ట్ ల వద్ద కేంద్ర సాయుధ బలగాలతో భద్రత పెంచడం జరిగింది. మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, చెక్ పోస్ట్లు వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలని జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. నారాయణపేట జిల్లా సరిహద్దులో అంతర్రాష్ట్ర చెక్పోస్టులు 07 అవి నారాయణపేట లో 1) జలాల్పూర్ చెక్ పోస్ట్, 2) ఎక్లాస్పూర్ చెక్ పోస్ట్, దామరగిద్దలో 3)కాన్కుర్తి చెక్ పోస్ట్ 4)ఉట్కూర్ లో సమస్తాపూర్ చెక్ పోస్ట్ కృష్ణ పోలీసు స్టేషన్ పరిధిలో 5) కృష్ణ బ్రిడ్జ్ చెక్పోస్ట్ 6) చెగుంట చెక్ పోస్ట్. మాగనూరులో 7)ఉజ్జేల్లి చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్ జిల్లా సరిహద్దుల్లో 1) మరికల్లో లాల్ కోట చెక్పోస్ట్ 2) కోస్గిలో సంపల్లి మొదలగు చెక్ పోస్టుల వద్ద కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు జిల్లా పోలీస్ లతో పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు, మద్యం, బంగారం ఇతర విలువైన వస్తువులు మొదలగునవి రవాణా చేయకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలని, వాహనాల నెంబర్ల రిజిష్టర్ లో రికార్డ్ చేయాలని ఎస్పీ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని ఎస్పీ తెలిపారు.