PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ధైర్యంగా ఉండండి.. సమస్యలన్నీ పరిష్కరిస్తాం..

1 min read

– విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్​ ఉమెన్​ ఆర్థిక సహాయ సహకార సంస్థ చైర్మన్​ కుమారి ముంతాజ్​ పటాన్​ బేగం
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, బధిరులు ధైర్యంగా ఉండాలని.. సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్​ ఉమెన్​ ఆర్థిక సహాయ సహకార సంస్థ చైర్మన్​ కుమారి ముంతాజ్​ పటాన్​ బేగం. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె ..విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ అసిస్టెంట్​ డైరెక్టర్​ పి. విజయతో కలిసి పలు ప్రాంతాలలో పర్యటించారు.

నందికొట్కూరు, నంద్యాల, కొత్తపల్లె, ఆత్మకూరు, కర్నూలు, కోడుమూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగులు, ప్రతిభావంతుల సమస్యలు అడిగి.. పరిష్కరించారు. ఆత్మకూరు చెందిన నలుగురు బధిరులకు ఈరింగ్మిషన్స్ అప్పటికప్పుడే వారి చేతుల మీదుగా ఇచ్చారు. అదేవిధంగా నంద్యాలకు చెందిన విభిన్న ప్రతిభావంతులు కరెంటు షాక్ కు గురై రెండుకాళ్లు, చెయి కోల్పోయారు. ఆవ్యక్తికి వెంటనే వీల్​ చైర్​మంజూరు చేశారు. అదేవిధంగా మంత్రాలయం కి చెందిన రాజ శేఖర్ కి సదరం సర్టిఫికెట్ కొరకు అప్పటికప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసి వారికి ఆన్లైన్ అక్కడే ఇచ్చి నంద్యాల క్యాంపు కి హాజరు కావాలని చెప్పారు. అలాగే సదరన్ లో జరుగుతున్న అవకతవకలను అరికట్టేందుకు తాను కృషి చేస్తానని, ఏవైనా ఉంటే నా దృష్టికి తీసుకురావాలని చైర్మన్ గారు విభిన్న ప్రతిభావంతుల కు బధిరులకు తెలియజేశారు .


కర్నూలు ఏ.డీ. విజయ్​ కృషి…అభినందనీయం
సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి ఆదేశానుసారం విభిన్న ప్రతిభావంతులకు పరికరాలు పంపిణీ చేస్తున్నానని, అదేవిధంగా సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్​ ఉమెన్​ ఆర్థిక సహాయ సహకార సంస్థ చైర్మన్​ కుమారి ముంతాజ్​ పటాన్​ బేగం. కల్లూరులో గుడ్​ వాక్​ సొసైటీ వారు తయారు చేసిన లిమ్స్​ కాల్​ ఫర్​, తదితర పరికరాలను విభిన్న ప్రతిభావంతులకు అందజేశారు. అనంతరం కర్నూలు అసిస్టెంట్​ డైరెక్టర్​ పి. విజయ విభిన్న ప్రతిభావంతులకు చేస్తున్న అభినందనీయమన్నారు. సాయంత్రం 4 గంటలకు విభిన్న ప్రతిభావంతుల హాస్టల్​లో జరిగిన వివిధ సంఘాల సమావేశానికి విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధులు సహకార కార్పొరేషన్ చైర్మన్​ కుమారి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుతోపాటు మోటార్ బైక్స్ రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు తెప్పించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా చైర్మన్​ హామీ ఇచ్చారు.

About Author