సీజనల్ వ్యాధులపై…అప్రమత్తంగా ఉండండి
1 min readప్రముఖ గ్యాస్ర్టో ఎంటరాలజిస్ట్, సీనియర్ వైద్యులు శంకర్ శర్మ
- పేదలకు దోమతెరలు పంపిణీ చేసిన వైద్యులు
పల్లెవెలుగు: సమాజంలో నీ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా విజ్ఞానవంతులు, చదువుకున్న వారు బాధ్యత గలవారు సీజనల్ వ్యాధుల పట్ల అందరిలో అవగాహన వచ్చేలాగా తమ వంతుగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ కోరారు. ఈరోజు కర్నూల్ నగరంలోని గాయత్రి ఎస్టేట్ లో సద్గురు దత్త పాలి క్లినిక్ లో పేద మహిళలకు దోమతెరలను పంపిణీ చేస్తూ దోమ కాటుకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన చేశారు. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ దోమలు కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ మెదడు వ్యాప్తి వ్యాధులు సంభవిస్తాయని చెప్పారు. వర్షాకాలంలో కలుషితమైన నీరు తాగడం వల్ల టైఫాయిడ్, పసిరికలు కలరా, గ్యాస్ట్రో ఎం ట రైటిస్, అమీబియాసిస్ వంటి వ్యాధులు సంభవిస్తాయని నీటిని కాచి చల్లార్చిన వాటిని త్రాగాలని కోరారు.