శాంతియుతంగా ఉండండి.. కాంగ్రెస్ మీతోనే !
1 min readపల్లెవెలుగువెబ్ : అగ్నిపథ్ స్కీమ్ పై నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో పౌరులంతా శాంతియుతంగా వ్యవహరించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. “మీ (ప్రజా) వాణిని పట్టించుకోకుండా ప్రభుత్వం పూర్తిగా దిశానిర్దేశం లేని కొత్త పథకాన్ని ప్రకటించడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. అహింసా పద్ధతిలో అందరూ శాంతియుతంగా నిరసనలు తెలపాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీతోనే ఉంటుంది” అని సోనియాగాంధీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.