ఆటుపోట్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి !
1 min readపల్లెవెలుగువెబ్ : క్యాపిటల్ మార్కెట్లో ఏర్పడే ఆటుపోట్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మార్కెట్ నియంత్రణ మండలి సెబీని కోరారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ‘ఫెడ్ రిజర్వ్’ వచ్చే నెల నుంచి వడ్డీ రేట్ల పెంపుతో పాటు నిధుల సరఫరా తగ్గించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఈ హెచ్చరిక చేయడం విశేషం. ఫెడ్ రిజర్వ్ తీసుకునే చర్యలతో భారత్‌తో సహా వర్థమాన దేశాల మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు భారీ ఎత్తున అమ్మకాలకు దిగే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలను సులభతరం చేసేందుకు వీలుగా సెబీ మరిన్ని సంస్కరణలు చేపట్టాలని కూడా ఆర్థిక మంత్రి కోరారు.