విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించండి
1 min read– గడపగడప కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ
– కేంద్రాల నిర్వహణపై ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలకు విద్యను, గర్భిణులు, బాలింతలుకు పౌష్టికాహారాన్ని, ఇతర సేవలను అందించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొణిదేల గ్రామంలో 2వ రోజు సర్పంచు కొంగర నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.చిన్నారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగన్న గోరుముద్ద పథకం అమలును పరిశీలించారు.మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తో ముచ్చటించారు.పిల్లల కోసం తయారు చేసిన ఆహారాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలును ప్రభుత్వం బలోపేతం చేస్తోందన్నారు.తల్లి కన్నా పాత్రను అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు పోషించాలన్నారు. చిన్నారులకు, బాలింతలుకు ఉత్తమ సేవలందించి అటు ప్రజలలోనూ మంచి గుర్తింపు పొందాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.కార్యక్రమంలో తహశీల్దార్ రాజశేఖర్ బాబు, ఎంపీడీఓ శోభా రాణి, విద్యుత్ శాఖ ఏఈ రాము నాయక్, మండల వ్యవసాయ అధికారి శ్రావణి, పశు వైద్యాధికారి నవీన్ కుమార్ రెడ్డి,మత్య్స శాఖ అధికారి భరత్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ మాధురి, పంచాయతీ రాజ్ ఏఈ ప్రతాప్ రెడ్డి , హౌసింగ్ ఏఈ అరుణ్, ఇఓఆర్ పిడి సుబ్రహ్మణ్యం శర్మ,కేసి కాలువ ఏఈ నరేష్ ,ఐసీడీఎస్ సూపర్ వైజర్ రమణమ్మ ,సింగిల్ విండో చైర్మన్ సగినేల ఉసేనయ్య,మాజీ సింగిల్ విండో చైర్మన్ బాలస్వామి,పంచాయతీ కార్యదర్శి గోపాల్, వీఆర్వో లు సుజిత, సురేష్, మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కిరణ్ కుమార్ ,ఉప సర్పంచి భాస్కర్ రెడ్డి ,ఏపీఓ ఖాసీం,ఏపీఎం మధు ,వైవైసీపీ నాయకులు ఉదయ్ కిరణ్ రెడ్డి, శంకరయ్య, మధు,వివిధ శాఖల అధికారులు, సచివాలయం సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.