లక్ష జనాభా పేరుతో ఎన్నికల్లో కురువలకు మొండి చెయ్యి
1 min readనోటా లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఖాతాలో కురువ కులస్థులు ఓట్లు…
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాలో ఐదు లక్షల ఓటర్లు ఉన్నప్పటికీ బీసీల్లో కొన్ని కులాలు కురువలు లక్ష జనాభా మాత్రమే ఉన్నారని చెప్పి తమకు సీట్లు తెచ్చుకునేందుకు మమ్మల్ని కురువ కులస్థులు సంఖ్య తప్పు చెప్పడం సబబు కాదు ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవని మీ ఇష్టానుసారంగా ఇతర కులాలను తక్కువ చేసి మాట్లాడడం సబబు కాదని కర్నూలు జిల్లా కురవ సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు అసోసియేట్ అధ్యక్షుడు గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి రంగస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మీకు చేతనైతే మీ జనాభా ఎంత ఉందో చెప్పి సీట్లు తెచ్చుకోండి కానీ మాకు కర్నూలు జిల్లాలో ఐదు లక్షల ఓటర్లు పత్తికొండలో ఆలూరులో ఆదోనిలో మంత్రాలయంలో ఎమ్మిగనూరులో కోడుమూరులో కర్నూల్ లో మెత్తం ఐదు లక్షల ఓటర్లు ఉన్నప్పటికీ కొన్ని కులసంఘాల నాయకులు కురవ కులానికి లక్ష జనాభా మాత్రమే ఉన్నారని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. మేము అన్ని కులాలకు సహకార అందించి చేస్తే మా మంచి తనాన్ని చాతకాని తనంగా చూస్తే మా ఓట్లు నోటా లేక ఇండిపెండెంట్ పెండెంట్ల ఖాతాలో చూపిస్తామని వారు హెచ్చరించారు. ఆ లక్ష జనాభా గురించి ఎవరైతే చెప్పారో వారి అభ్యర్థులకు మా కులం ఓట్లు వేసే ప్రసక్తే లేదని నిజా నిజాలు తెలుసుకోకుండా ప్రధాన రాజకీయ పార్టీలు ఇలా చేయడం సబబు కాదని మీరు సీట్లు ఇచ్చిన ఈకపోయినా ప్రతి నియోజకవర్గము నుంచి కురువ కులస్తులు పోటీలో ఉంటారని వారు తెలిపారు పోటీలో ఉండదలచిన ఔత్సాయమైన యువకులు తమ బయోడేటాను కర్నూలు జిల్లా కురవ సంఘం నాయకులకు వాట్స్అప్ ద్వారా స్వయంగా గాని పంపగలరని కోరుచున్నాము వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో కురువ లు గొర్రెల కాపరులు తడాఖా ఏందో రాజకీయ పార్టీలకు చూపిస్తామని వారు హెచ్చరించారు.