PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘డెంగ్యూ’ పై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ పి. కోటేశ్వరరావు

1 min read

పల్లెవెలుగు వెబ్​: డెంగ్యూ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు  పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సీజనల్ వ్యాధుల పై ఆరోగ్య శాఖ అధికారులతో, ఎంపీడీవోలతో, మునిసిపల్ అధికారులతో  జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు పడుతున్నందున  డెంగ్యూ  వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు, వీటి నియంత్రణకు ముందుగానే చర్యలు చేపట్టాలన్నారు. నీరు నిల్వ ఉండడం వలన దోమ లార్వాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ముఖ్యంగా సిమెంట్ తొట్టెలు, వాడి వదిలేసిన కొబ్బరి బోండాలు, వాడని టైర్లు, ఎయిర్ కూలర్ల లో, ఫిష్ అక్వేరియం లో నీటి నిల్వ వల్ల లార్వా అభివృద్ధి చెంది డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తుందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫ్రైడే డ్రై డే లో భాగంగా వారంలో శుక్రవారం రోజున చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.   రాబోయే రోజుల్లో కేసులు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, అలా కేసులు నమోదు కాకుండా గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.. అదే విధంగా నీటి నిల్వ వల్ల వ్యాధులు ప్రబలడంపై  ఆడియో సందేశాలు రూపొందించి  గ్రామాల్లో ఆటో ల ద్వారా  ప్రజల్లో చైతన్యం తేవాలని డి పి వో ను ఆదేశించారు. ఏ ఏ మండలాల్లో కేసులు ఎక్కువ వస్తున్నాయో గుర్తించి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ వహించండి అని సంబంధిత అధికారులను ఆదేశించారు.  కార్యక్రమంలో డిఎంహెచ్వో రామ గిడ్డయ్య, జిల్లా పరిషత్ సిఈఓ నాసర రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా మలేరియా అధికారి నూక రాజు, DCHS రాంజీ నాయక్, మునిసిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author