సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
1 min read
పల్లెవెలుగువెబ్, చాగలమర్రి :సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటమ్మ . చాగలమర్రి ప్రభుత్వ వైద్యశాలలో ఆశా దినోత్సవం సందర్బంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాలలో సీజనల్ వ్యాధులైన మలేరియా,డెంగ్యూ,చికెన్ గున్యా,కామెర్లు తదితర వ్యాధులు సోకకుండా తగిన జాగ్రతలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో మురుకి నీరు నిల్వ లేకుండా తగు చర్యలు తీసుకోకుంటే ప్రజలు రోగాల భారిన పడక తప్పదన్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు గ్రామాలలోని ఓవర్ పెడ్ ట్యాంకులను శుభ్రపరచి క్లోరినేషన్ చేయిస్తున్నామన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా దోమ తెరలు వినియోగించాలన్నారు।. కార్యక్రమంలో సిహెచ్‌ఓ రెడ్డమ్మ,హెల్త్ సూపర్‌వైజర్‌లు రామలింగారెడ్డి,సీతారాముడు,ప్రమీలమ్మ,ఆరోగ్య,ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.