కరోనాపై అప్రమత్తంగా ఉండండి..
1 min read– టీజీవీ సంస్థల చైర్మన్ టిజి భరత్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీజీవీ సంస్థల చైర్మన్ టీజీ భరత్ పిలుపునిచ్చారు. మాస్క్‌లు ధరిస్తూ.. శానిటైజర్ వాడుతూ,భౌతిక దూరం పాటించాలని సూచించారు. శుక్రవారం నగరంలోని 4వ వార్డు కుమ్మరి వీధి నాలుగు రస్తాల వద్ద టీడీపీ నాయకులు ఊట్ల రమేష్‌బాబు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీజీ భరత్ ప్రారంభించారు. అనంతరం చలివేంద్రంలోని నీరు స్థానికులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రత పెరిగిపోయిందని, తాగునీరు అధికంగా తీసుకోవాలన్నారు. ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో 8వ వార్డు కార్పొరేటర్ పరమేష్, నాయకులు ప్రసాద్, గిడ్డయ్య, అర్జున్, శ్రీనివాసులు, నాగరాజు, వెంకటేష్, నరసింహ, నాగేంద్ర, శ్రీనాథ్ గౌడ్, మధు తదితరులు పాల్గొన్నారు.