PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అప్రమత్తంగా ఉండండి..

1 min read
వెల్దుర్తిలో మాస్కులు పంపిణీ చేస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప

వెల్దుర్తిలో మాస్కులు పంపిణీ చేస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప

–ఎస్పీ ఫక్కీరప్ప
పల్లెవెలుగు వెబ్​, డోన్​,వెల్దుర్తి : ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి.. కరోనాను తరిమి కొట్టాలని ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప పిలుపునిచ్చారు. శనివారం డోన్​పట్టణంలో పర్యటించిన ఆయన.. ప్రజలకు మాస్కులు అందజేశారు. డీజీపీ ఆదేశాలమేరకు జిల్లాలోని 87 పోలీస్​ స్టేషన్ల పరిధుల్లోని కరోనా వైరస్​పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ… మాస్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. శానిటైజర్​ ఉపయోగిస్తూ.. భౌతిక దూరం పాటించాలని ఎస్పీ సూచించారు. అదేవిధంగా వెల్దుర్తి పట్టణంలో కూడా ప్రజలకు మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు డోన్ డిఎస్పి నరసింహారెడ్డి ,డోన్ సిఐలు సుబ్రహ్మణ్యం , మహేశ్వరరెడ్డి, వెల్దుర్తి ఎస్​ఐ పెద్దనాయుడు, సిబ్బంది ఉన్నారు.

About Author