‘బీకేర్ ఫుల్.. మీకు గుణపాఠం చెప్పే బాధ్యత నాది’
1 min readపల్లెవెలుగు వెబ్: వైసీపీ నేతల బెదిరింపులకు పారిపోయే వాళ్లం కాదని, సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతామని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేసే వాళ్లకు గుణపాఠం చెప్పే బాధ్యత వ్యక్తిగతంగా తాను తీసుకుంటానని నారా లోకేష్ చెప్పారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో టీడీపీ నేతలు నాగేశ్వర్ రెడ్డి, ప్రతాపరెడ్డి భౌతికకాయానికి నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. పార్టీ అన్ని రకాలుగా కుటుంబ సభ్యులను ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ మీకు చేతనైతే రాయలసీమకు ప్రాజెక్టులు తీసుకురండి. పరిశ్రమలు తీసుకురండి. అంతే కానీ, తెదేపా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోం. మా ఓపిక పరీక్షించొద్దు. మేం పారిపోం. ఎదురొడ్డి పోరాడుతాం. మా పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారు. మేం ఎక్కడికి పోం ’ అంటూ వైకాపా నేతల మీద నారా లోకేష్ విరుచుకుపడ్డారు.