NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీస్ట్ మూవీ ట్విట్ట‌ర్ రివ్యూ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తమిళ స్టార్‌ విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బీస్ట్‌’. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో విజయ్‌..భారత్‌ తరపు ‘రా’ ఏజెంట్‌గా నటించాడు. ఓ షాపింగ్‌ మాల్‌లోకి కొంతమంది ఉగ్రవాదులు చొరబడి, ప్రజలను బందీలుగా మారుస్తారు. ఉగ్రవాదుల చెర నుంచి ప్రజలను ఏ విధంగా రక్షించారనేదే ఈ మూవీ కథ. ఫస్టాఫ్‌ సరదాగా సాగిపోతుందని, విజయ్‌ తనదైన కామెడీతో నవ్వించాడని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఇక రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టించిన అర‌బిక్ కుత్తు సాంగ్‌ థియేటర్లలో ప్రేక్షకులను ఈలలు వేయిస్తుందట. విజయ్‌ తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడని, ‘రా’ ఏజెంట్‌ వీర రాఘ‌వ‌న్ పాత్రలో ఒదిగిపోయాడని చెబుతున్నారు. కామెడీ, డాన్స్‌, నేపథ్య సంగీతం చాలా బాగుందని కామెంట్‌ చేస్తున్నారు. అయితే స్క్రీన్‌ప్లే అంతగా వర్కౌట్‌ కాలేదట. కథని సీరియస్‌గా గానీ, కామెడీగా కానీ ముందుకు తీసుకెళ్లకుండా గజీబిజీగా తెరకెక్కించాడని ఓ నెటిజన్‌ అభిప్రాయపడ్డాడు. కథ కూడా రొటీన్‌గా ఉందని కామెంట్‌ చేస్తున్నారు.

                                      

About Author