NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీ కార్పొరేటర్లను.. కొట్టడం దారుణం..

1 min read

వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్​

  • దాడి విషయమై ఎస్పీకి ఫిర్యాదు
  • పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి

కర్నూలు, పల్లెవెలుగు:కర్నూలు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను నాయకులను కౌన్సిలింగ్ కొరకు పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారిపై ఎటువంటి ఆధారాలు లేకుండా  చేయి చేసుకోవడం దురదృష్టకరం అని వైస్సార్సీపీ కర్నూలు Mla అభ్యర్థి Amd. ఇంతియాజ్ ఖండించారు. ఇలాంటి చర్యలు  ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తూ కర్నూలు జిల్లా ఎస్పీకి లిఖిత పూర్వకంగా  ఫిర్యాదు అందించారు. ఇటు వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని sp గారిని కోరారు.వైస్సార్సీపీ కార్యకర్తలపై, పోలీసులవేధింపులు తగవని అన్నారు.కర్నూలు నియోజక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ A.Md.ఇంతియాజ్ గారు, కర్నూలు ఎమ్మెల్యే  హఫీజ్ ఖాన్, కర్నూలు మాజీ ఎమ్మెల్యే శ్రీ S.V. మోహన్ రెడ్డి మరియు కార్పొరేటర్లు నాయకులుతదితరులు పాల్గొన్నారు.

About Author