రమణీయం.. మహానందీశ్వర స్వామి రథోత్సవం
1 min readపల్లెవెలుగు మహానంది: మహానంది క్షేత్రం లో శ్రీ కామేశ్వరీ దేవి సమేత మహానందీశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండువగా సాగింది .గురువారం ఉదయం క్షేత్రంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు .శాస్త్ర యుక్తంగా ,వేద మంత్రోచ్ఛారణలు మంగళ వాయిద్యాలు మధ్య ప్రత్యేక పూజలను వేదపండితులు రుత్వికులు నిర్వహించారు రథశాల వద్దవేదపండితులు రుత్వికులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు .రథాంగ బలి,బలిహరణ ,కొబ్బరికాయ గుమ్మడికాయ లు రథం వద్ద కొట్టి వేద మంత్రోచ్ఛారణలు మంగళ వాయిద్యాల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు క్షేత్రంలోఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాల అనంతరం ఆలయంలోని ప్రధాన రాజగోపురం గుండా ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పల్లకీలో తీసుకొని వచ్చి రథంపై ఆశీనులు గావించారు. అనంతరం రథ శాల వద్ద న్యాయమూర్తితో పాటు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆలయ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి నంద్యాల ఏ ఎస్ పిచిదానంద రెడ్డి వేద పండితులు రవిశంకర్ అవధాని శాంతారాం బట్ నాగేశ్వర శర్మ ఆలయ ఏఈవో మధు కొబ్బరికాయలు కొట్టి అశేష జనవాహిని మధ్య రథోత్సవాన్ని ప్రారంభించారు .అశేష జనవాహిని మధ్య శంభో శంకర …..హర హర మహాదేవ శంభో శంకర ..పంచాక్షరి మంత్రం పఠిస్తూ భక్తులు రథాన్ని ఆలయ మాడ వీధుల గుండా లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు మధ్య మధ్యలో ప్రధానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి భక్తుల కు ఇచ్చిన అనంతరం రథోత్సవాన్ని ప్రారంభిస్తూ చివరకు రథ శాల వద్దకు తీసుకొని వచ్చి యదా స్థానంలో రథాన్ని ఆపి మరలా దర్శన భాగ్యం వచ్చే ఏడాది కూడా కల్పించాలని స్వామి అమ్మవార్లను కోరుకున్నారు.