NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రమణీయం.. వీరభద్ర స్వామి రథోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్, ఆస్పరి: కొలిచే వారికి కొంగుబంగారం వెలసిన శ్రీ వీరభద్రస్వామి, కాళికా దేవి అమ్మవార్ల రథోత్సవం శనివారం మండలంలోని కైరుప్పలో వేలాది మంది భక్తజనసందోహం మధ్య జరిగింది. ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, కుంకుమార్చన, ఆకు పూజ నిర్వహించారు. సాయంత్రం భక్తజనుల మధ్య రథోత్సవం కార్యక్రమం నిర్వహించారు. రథోత్సవంను తిలకించేందుకు మండల ప్రజలే కాకుండా ఇతర రాష్ర్టాలు, జిల్లాల నుంచి భక్తుల భారీ సంఖ్యలో తరలివచ్చారు. రథోత్సవంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు సీఐ భాస్కర్​ నాయుడు పోలీసుబందోబస్తు నిర్వహించారు. రథోత్సవ వేడుకలలో సర్పంచ్ తిమ్మక్క, వైసీపీ నాయకులు బీటెక్ వీరభద్ర , లక్ష్మన్న, వీరన్న, జీకే వీరేష్, సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి, అంగిడి వీరభద్రప్ప, అంగిడి వీరేష్ ,సిపిఐ నాయకులు ముద్దు రంగన్న , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

About Author