అందత్వ నివారణే లక్ష్యం … ఎమ్మెల్యే
1 min read
అందత్వ నివారణే లక్ష్యంగా మా ప్రభుత్వము పని చేస్తున్నందనీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అన్నారు .
పల్లెవెలుగు , కర్నూలు: బుధవారం స్థానిక మున్సిపల్ హైస్కూల్ నందు జిల్లా అందత్వ నివారణ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా విద్యార్థులకు కళ్ళ జోడు పంపిణి కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి . ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ మా ప్రభుత్వము లో అందత్వ నివారణ సంస్థ ద్వారా అంధత్వాన్ని నివారించేందుకు, కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తాయని అందత్వ నివారణ సంస్థలు చేసే పనులు ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం, స్కూల్ పిల్లలకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేయటం జరుగుతున్నదని తెలియ జేశారు. అందులో భాగంగా ఈరోజు మున్సిపల్ హైస్కూల్ నందు పిల్లలందరికీ కంటి టెస్టు చేసి వారికి అవసరమైనటువంటి కళ్ళజోడు నందు మా ప్రభుత్వం నుండి ఉచితంగా విద్యార్థులందరికీ అందజేస్తున్నామని ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. విద్యార్థులందరూ బాగా చదువుకుని చదువుల్లో రాణించాలంటే కళ్ళు సరిగ్గా పనిచేయాలని అందుకే మా ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్క విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా కంటి చెట్లు చేస్తామని అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోడి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉపయోగపడే వారు చదువులో రాణించడానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసుధన్ ,మునిసిపల్ చైర్మన్ శ్రీమతి శాంతి ,మునిసిపల్ కమీషనర్ ,జిల్లా అధికారులు,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.