NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అందాల నిధి.. గుండెకే గాలం వేస్తూ..

1 min read

సినిమా డెస్క్​ : సినిమాల్లో ఓ మోస్తరు హాట్‌గా కనిపించే నిధి.. సోషల్ మీడియాలో మాత్రం మరింత డోస్ పెంచేస్తుంటుంది. ప్రస్తుతం సౌత్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా టాప్‌లో నిలిచే హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. తన అందాలు చూసి ఫిదా అయిపోయే కుర్రాళ్లు ఉండరు అంటే నమ్మశక్యం కాదు. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన నిధి ఆ తర్వాత సౌత్‌లో ల్యాండ్ అయింది. ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తెలుగులో చేసిన మొదటి రెండు చిత్రాలు సవ్యసాచి, మిస్టర్ మజ్ను ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నా, మూడో మూవీ ‘ఇస్మార్ట్ శంకర’ తో సక్సెస్‌ అందుకుంది నిధి. ఈ మూవీలో తన గ్లామర్ ట్రీట్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించింది. ఈ మధ్యే భూమి ఈశ్వరన్ సినిమాలతో కోలీవుడ్‌లో కూడా పాగా వేసింది. తాజాగా ఆరెంజ్ కలర్ టాప్‌తో అందాలు ఆరబోస్తూ.. మత్తెక్కించే కళ్లతో కుర్రాళ్ల గుండెకు గాలెం వేస్తున్న నిధి ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్‌ చేస్తున్నాయి. ఇలా రెగ్యులర్ గ్లామర్ ట్రీట్స్‌తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటున్న నిధిని చూసి ఆమె సినీ కెరీర్‌‌కి ఏ ఏమాత్రం ఢోకా ఉండదంటున్నారు. అంతేకాదు ప్రస్తుతం. పవర్‌‌ స్టార్‌‌ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ సినిమా ‘హరిహర వీరమల్లు’తో పాటు మరో నాలుగు చిత్రాలను లైన్‌లో పెట్టింది నిధి.

About Author