NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగం మానేసినందుకే.. `మంచు` కక్ష‌గ‌ట్టారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మంచు విష్ణు కార్యాల‌యంలో దొంగ‌త‌నం కేసు ఆస‌క్తిక‌ర మ‌లుపు తిరిగింది. ఉద్యోగం మానేసినందుకే కక్ష కట్టి కేసులు పెడుతున్నారని పేర్కొంటూ హెయిర్‌ స్టైలిస్ట్‌ నాగశీను ఓ వీడియో విడుదల చేశాడు. మంచు విష్ణు కార్యాలయంలో రూ. 5 లక్షల విలువైన సామగ్రి చోరీకి గురయ్యాయని కార్యాలయ మేనేజర్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హెయిర్‌ స్టైలిస్ట్‌ నాగశీనుపై అనుమానం ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగశీను ఓ వీడియో విడుదల చేయడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. తాను ఫిబ్రవరి 17 వరకు మంచు విష్ణు కార్యాలయంలో పనిచేసి అక్కడి పరిస్థితి నచ్చక ఉద్యోగం మానేసినట్టు వీడియోలో చెప్పాడు. తనను కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశాడు. సీసీ కెమెరాలు పరిశీలించిన తరువాత విచారణ ప్రారంభించనున్నట్టు పోలీసులు తెలిపారు.

                                       

About Author