PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీబీఎస్ఈ లో బీరం  ప్రభంజనం

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  విద్యకు నిలయంగా నెలకొల్పబడిన  బీరం శ్రీధర్ రెడ్డి అంతర్జాతీయ పాఠశాల సీబీఎస్ఈ-  2023 పదవ తరగతి ఫలితాలలో సరికొత్త రికార్డు నెలకొల్పింది.ఈ ఫలితాలలో బీరం పాఠశాల పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి,గణితంలో నూటికి నూరు మార్కులు సాధించారు.అలాగే 98% పైగా ముగ్గురు విద్యార్థులు, 95 % పైగా6 మంది విద్యార్థులు,90 % పైగా 22 మంది విద్యార్థులు మార్కులు సాధించి జిల్లాలోనే మొదటి స్థానం కైవసం చేసుకుని, అగ్రగామి విద్యాసంస్థగా బీరం విద్యాసంస్థలు నిలిచి సరికొత్త రికార్డును నెలకొల్పాయి.అలాగే బీరం జూనియర్ కళాశాల విద్యార్థులు ఐఐటీ,జేఈఈ మెయిన్స్ 2023 ఫలితాలలో ఆల్ ఇండియా 30 ర్యాంకుతో పాటు 22 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం జరిగింది. మరియు ఇటీవల జరిగిన  నీట్ పరీక్ష  యందు ఆల్ ఇండియా స్థాయిలో 720 మార్కులకు 700 మార్కులు విద్యార్థులు సాధిస్తారని అంచనా అలాగే నీట్ పరీక్షలో పాల్గొన్న విద్యార్థులు అందరూ కూడా ఉత్తమ ఫలితాలను సాధిస్తారని బీరంకళాశాల యాజమాన్యం పేర్కొన్నారు.ఈ విజయోత్సాహంలో   బీరం శ్రీధర్ రెడ్డి విద్యాసంస్థల  కరస్పాండెంట్ సుబ్బారెడ్డి  మరియు చైర్ పర్సన్ సరస్వతమ్మ లు మాట్లాడుతూ బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాల సీబీఎస్ఈ పదవ తరగతిలో మంచి మార్కులు సాధించి జిల్లాలోనే  మొదటి స్థానం కైవసం చేసుకున్నందుకు, ఎంతో సంతోషంగా ఉందని ఈ  విజయ పరంపర భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని,బీరం శ్రీధర్ రెడ్డి విద్యాసంస్థలు నాణ్యమైన విద్యను అందించి ప్రతిష్టాత్మక విజయాలను సాధించి,భవిష్యత్తులో విద్యా రంగంలో ఒక బ్రాండ్ గా మారుతుందని వారు పేర్కొన్నారు. ఇంతటి విజయం  సాధించడానికి విద్యార్థుల, ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల సమిష్టి కృషి వలన సాధ్యమైందని వారికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు ఇంతటి అఖండ విజయాలను  సాధించడానికి యాజమాన్య నిరంతర పర్యవేక్షణ, ఉపాధ్యాయుల కృషి,విద్యార్థుల నిరంతర శ్రమ వలననే సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్, బీరం పాఠశాల ప్రిన్సిపల్ శ్వేత, కళాశాల ప్రిన్సిపల్ హేమచందర్  మాట్లాడుతూ తదితరులు పాల్గొన్నారు.

About Author