PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సారాయి అమ్మబడును”స్టిక్కర్ హల్ చల్..!

1 min read

– మహిళా పోలీసులు ఉన్నా అరికట్టలేకపోతున్న వైనం -పోలీసులకు పెను సవాల్

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మా గ్రామంలో సారాయి అమ్మబడును అనే స్టిక్కర్ గుర్తుతెలియని వ్యక్తులు గోడపై అతికించిన స్టిక్కర్ హల్చల్ చేస్తోంది.గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామం మెయిన్ బజారులో గ్రామ సచివాలయం పక్కనే ఓ ఇంటి గోడకు అందరికీ కనబడే విధంగా మా”చౌటుకూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో సారాయి అమ్మబడును”అనే స్టిక్కర్ ను అతికించడంపై సోషల్ మీడియాలో ఈ స్టిక్కర్ హల్చల్ చేస్తూ ఉంది. దీనిని చూసిన వారందరూ కూడా అవాక్కు అవుతున్నారు.చాలా రోజుల నుండి మా గ్రామంలో పదిమంది ఇండ్ల దగ్గరే  సారాయి తయారు చేసి  అమ్ముతున్నారని ఎన్నిసారర్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని అంతే కాకుండా గతంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో గతంలో పని చేసిన సీఐ,ఎస్ఐ ల ముందరే ఎమ్మెల్యేకు ఎస్సీ కాలనీ వాసులు మొరపెట్టుకున్నారు. అంతేకాకుండా మండలంలో 19 పంచాయతీలకు గాను 14 గ్రామ సచివాలయాలకు 14 మంది మహిళా పోలీసులను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నియమించింది.పచ్చని పల్లెల్లో సారాయి,బెల్ట్ (మద్యం అమ్మడం)అరికట్టడంలో పోలీసులు విఫలం అవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇక్కడే కాదు మండలంలోని చాలా గ్రామాల్లో నాటు సారా బెల్ట్ అమ్మడం వలన చాలా పేద కుటుంబాలు మద్యానికి బానిస అయ్యి ఎన్నో కుటుంబాలు చిన్నా భిన్నం అవుతున్నాయని ప్రజలు అంటున్నారు.కానీ ఈ మధ్యనే బాధ్యతలు తీసుకున్న ఎస్సై జగన్ మోహన్ పేకాట నాటు సారా మద్యం ఇలాంటి వాటి పట్ల ముందుకు వెళ్తూ పక్కా సమాచారం మేరకు ఇలాంటి వారి పట్ల కేసులు నమోదు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు.మండలంలోని అన్ని గ్రామాలలో సారాయి,బెల్ట్ మద్యం అమ్ముతున్న వారి పట్ల పోలీసులు దృష్టి సారించి అరికట్టే విధంగా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.మరీ రాబోయే రోజుల్లో ఏ విధమైన చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

About Author