‘బీరం’ ఐఐటి ర్యాంకర్ల అపూర్వ సమ్మేళనం
1 min readపల్లెవెలుగు చెన్నూరు: బీరం విద్యా పరిమళాన్ని దేశ నలుమూలల వ్యాపింప చేసిన బీరం విద్యా కుసుమాలతో ప్రస్తుత విద్యార్థులకు బీరం యాజమాన్యం చర్చాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బీరం విద్యాసంస్థల చైర్మన్ బీరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రారంభించిన మొదటి బ్యాచ్ తోనే 16 ఐఐటి ర్యాంకులు సాధించినటువంటి ఏకైక కళాశాల బీరం జూనియర్ కళాశాల అని తెలియజేశారు. ఈ కళాశాలలో చదివి దేశంలోని ప్రముఖ ఐఐటీలలో సీట్లు సాధించినటువంటి విద్యార్థులైన వి. ఓబుల్ రెడ్డి, సి. మహిత్ కుమార్ రెడ్డి కే. బాలాజీ, సి.నివాస్ కె.ఉమామహేశ్వర్, ఆర్. వి.ఎస్. ఆర్.రూపేష్ లు పాల్గొన్నారు. ఈ విద్యార్థులు తమ అనుభవాలను వారు ఉత్తమ ర్యాంకులను సాధించడానికి అవలంబించిన ప్రణాళికలను ప్రస్తుతం వారు అనుభవిస్తున్నటువంటి ఐఐటి జీవితం గురించి విద్యార్థులకు తెలియజేశారు.వారు ఈ రోజు ఇలాంటి స్థాయిలో ఉండడానికి నిరంతర కృషి చేసిన యాజమాన్య, ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. వారు విద్యార్థులకి తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు. వారు ఇంత ఉత్తమ ర్యాంకులు సాధించడానికి కారణం అయినటువంటి అన్ని విషయాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. మొదటగా ఉపాధ్యాయులను గౌరవించి, వారు చెప్పేటువంటి విషయాలను శ్రద్ధగా ఆలకించి ఒక ప్రణాళిక బద్ధమైన సమయపాలన గావించి విద్యను అభ్యసించాలని తెలియజేశారు. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, చక్కటి విద్యా బోధన,మరియు అంకిత భావం కలిగిన యాజమాన్యం, అనేది విద్యార్థులకు ఎంతో అవసరమని అలాంటి విద్య బోధనని, నిర్దిష్ట ప్రణాళికను మరియు అంకిత యాజమాన్యాన్ని కలిగిన ఏకైక కళాశాల బీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కళాశాల. కేవలం వారు ఈ కళాశాలలో అందించినటువంటి విద్యా బోధన కారణంగానే తాము ఇటువంటి ఉన్నత ర్యాంకులు సాధించి ఉత్తమ ఐఐటీ సంస్థల్లో సీట్లు సాధించామని తెలియచేసి తమ కళాశాల యాజమాన్యానికి తమ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈరోజు మేము సగర్వంగా బీరం విద్యార్థులమని చాటి చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అలాగే ఇక్కడ చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాలను సాధించిఉత్తమ స్థాయిలో నిలవాలని వారు ఆశించారు. విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసి వారికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. విద్యార్థులందరూ వారిని చూసి చాలా ఆనందపడ్డారు. భవిష్యత్తులో తాము వీరిలాగే విజేతలగా మారి తమ విద్యాసంస్థకు తలమానికంగా నిలుస్తామని విద్యార్థులు ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. అలాగే తమ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి స్టార్ ఎస్ బ్యాచ్ లో ఐఐటి సిలబస్ అభ్యసించినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటి ఎన్ఐటీలో తప్పకుండా సీట్ సాధిస్తారని అది మా గ్యారెంటీ అని వారు పేర్కొన్నారు.