బీరం శ్రీధర్ రెడ్డి విద్యాసంస్థల ఇంట జేఈఈ మెయిన్స్ ఫలితాల పంట
1 min readపల్లెవెలుగు వెబ్ కడప: ఖాజీపేట మండలం కడప కర్నూల్ హైవే సమీపంలో నెలకొల్పబడ్డ బీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కళాశాల ఐఐటీ జేఈఈ మెయిన్స్ ఫలితాలలో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. సముద్రమంత విజయాన్ని పొందాలంటే ఆకాశమంత శ్రమ అవసరమని అలాంటి శ్రమని ఇష్టంగా భావించి ప్రారంభించిన మొదటి బ్యాచ్ తోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చరిత్ర సృష్టించిన బీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థి వి. ఓబుల్ రెడ్డి 99.97 పర్సంటైల్ సాధించి ఆలిండియా 30వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఆలిండియా 30 వ ర్యాంకు తో పాటు
ఎం.లక్ష్మీ శ్రుతి – 99.82,
సి.మహిత్ కుమార్ రెడ్డి – 99.82
కె . వేదామృత – 99.35,
కె . బాలాజీ – 99.14,
ఆర్. వి. యస్. రూపష్ – 98.67
ఎమ్. వి. ఎన్. సాయి తేజ – 98.6
వై. సాయి మహిమ రెడ్డి – 97.89
సి. నివాస్ – 97.52
బి. చంద్రమౌళియన్ రెడ్డి – 97.37
K. ఉమా మహేశ్వర్ రెడ్డి – 97.35
జె. సురేంద్ర రెడ్డి – 96.38
వై. శ్రీ లక్ష్మి నిషిత – 96.37
టి.దేవేంద్ర రెడ్డి – 96.17
ఆర్. పూజిత – 95.46
పర్సంటైల్ సాధించి ప్రముఖ కార్పొరేట్ కళాశాలకు దీటుగా నిలబడి మన జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలబెట్టారు.
ఈ ఆనందోత్సాహంలో బీరం విద్యాసంస్థల కరస్పాండెంట్ సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారిని తీర్చిదిద్దిన అధ్యాపకులను సన్మానించి,మొదటి బ్యాచ్ తోనే ఇంతటి ఘన విజయాన్ని సాధించామని ఈ విజయం విద్యార్థుల కృషికి, తల్లిదండ్రుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచాయని,ఈ విద్యాసంస్థల పట్ల తమ బాధ్యతను మరింత రెట్టింపు చేశాయని, విద్యార్థుల కృషికి తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలియజేశారు . చైర్ పర్సన్ శ్రీమతి సరస్వతమ్మ గారు మాట్లాడుతూ తమ విద్యార్థులు జాతీయస్థాయిలో కూడా ఉన్నతంగా రాణించారని భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీమతి స్వాతి శ్రీకాంత్ గారు మాట్లాడుతూ విద్యార్థులను అభినందించి ఈ విజయ పరంపర భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని తమ ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ శ్వేతా గారు, మరియు కాలేజ్ ప్రిన్సిపల్ హేమచందర్ గారు మాట్లాడుతూ ఈ ఫలితాలు తమ విద్యాసంస్థలకు చాలా గర్వకారణం అని, విద్యార్థులను విజేతలుగా తీర్చిదిద్దిన కాలేజ్ యాజమాన్యానికి, అధ్యాపక బృందానికి,తల్లిదండ్రులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.