విడుదలకు ముందే.. దర్శకుడికి రూ. కోటి కారు గిప్ట్
1 min readపల్లెవెలుగువెబ్ : ఖిలాడి చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కానుంది, రవితేజ సినిమాలో హీరోగా నటించాడు. రమేష్ వర్మ సినిమాకు దర్శకుడు. కోనేరు సత్యనారాయణ నిర్మాత. అయితే , సినిమా విడుదలకు ముందే ఈ చిత్ర దర్శకుడు రమేష్ వర్మకు నిర్మాత కోనేరు సత్యనారాయణ ఖరీదైన రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ రేంజ్ రోవర్ ‘వెలార్’ అనే మోడల్ కాగా, దీని విలువ రూ. 1.15 కోట్లు. ఇలా మూవీ రిలీజ్ కాకముందే దర్శకుడికి.. నిర్మాత భారీ గిఫ్ట్ ఇచ్చారంటే ‘ఖిలాడి’ భారీ సక్సెస్ సాధిస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీ వర్గాలలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.