NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యాచకులు అనాధలకు అన్నదానం…

1 min read

కొందరికైనా ఆకలి తీర్చాలి.. సేవే మా లక్ష్యం

శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన ఈశ్వర్ రెడ్డి..

పల్లెవెలుగు వెబ్ కడప : సేవా భావంతో ఒక పూటైన అన్నదానం చేయాలనే ఉద్దేశంతో మా సేవా కార్యక్రమాల్లో భాగంగా అనాధలకు యాచకులకు అన్నదానం చేయడం జరిగిందని శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన ఈశ్వర్ రెడ్డి అన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో మాకు తోచిన కాడికి మా ట్రస్టు తరుపున పలు రకాల సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు, ఎన్నో రకాల సేవలు అందిస్తున్న మేము, అన్నదానం చేయడంలో చాలా సంతోషకరంగా భావిస్తున్నామని అన్నారు, మన దేశంలో అన్నం లేక తల్లడిల్లి పోతున్న ఎంతోమంది అభాగ్యులు, ఇలాంటి పరిస్థితిని గమనించిన మేము కొందరికైనా సహాయపడాలని ఉద్దేశంతో శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కడప నగరంలోని రోడ్ల పైన ఉన్న నిరాశ్రయులకు, యాచకులకు అన్నదానం చేయడం జరిగిందన్నారు, ప్రతి ఒక్కరూ మనకు ఉన్నదాంట్లో మరొకరికి కొద్దిగైనా సేవ భావంతో సహాయపడాలని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మెంబెర్స్ అమర్నాథ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author